భర్తతో గొడవ.. మహిళ సూసైడ్..హిమాయత్ నగర్ లో ఘటన

భర్తతో గొడవ.. మహిళ సూసైడ్..హిమాయత్ నగర్ లో ఘటన

బషీర్​బాగ్, వెలుగు: ఆర్థిక ఇబ్బందుల వల్ల తరచూ భర్తతో జరుగుతున్న గొడవల కారణంగా మనస్తాపానికి గురై మహిళ సూసైడ్ చేసుకుంది. హిమాయత్ నగర్ ఉర్దూ గల్లీలో నివాసం ఉంటున్న శిరీష (53), మహేశ్ దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. మహేశ్ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండటంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి.

ఈ విషయంలో దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా ఇరువురి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఈ క్రమంలో శిరీష తన గదిలోకి వెళ్లి ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.