పేరెంట్స్‌‌‌‌కు కూడా నచ్చేలా యూత్‌ మూవీ

పేరెంట్స్‌‌‌‌కు కూడా నచ్చేలా యూత్‌ మూవీ

కెన్ కరునాస్ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘యూత్‌‌‌‌’. సూరజ్ వెంజరముడు, దేవదర్శిని చేతన్ కీలకపాత్రలు పోషించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ నిర్వహించారు. హీరోలు శ్రీ విష్ణు, సత్యదేవ్, డైరెక్టర్స్ సాయి రాజేశ్, వశిష్ట, హసిత్ గోలి అతిథులుగా పాల్గొన్నారు. తమిళంలోలాగే తెలుగులోనూ ఈ చిత్రం విజయం సాధించాలంటూ అతిథులంతా బెస్ట్ విషెస్ చెప్పారు.

 హీరో, దర్శకుడు కెన్‌‌‌‌ మాట్లాడుతూ ‘ఇటీవల​ సూర్య,  కార్తి గార్లను కలిసి మా సినిమా తెలుగులో రిలీజ్‌‌‌‌ చేస్తున్నామని చెప్పా. తెలుగు ఆడియెన్స్ సినిమాను ఎంతగానో లవ్ చేస్తారని, తమిళంలో ఎలాంటి సక్సెస్ వచ్చిందో, తెలుగులోనూ అదే ఫలితం వస్తుందని వారు చెప్పారు.  ‘రఘువరన్ బీటెక్’ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రతి ప్రేక్షకుడు మా చిత్రాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు’ అని  తెలిపాడు.

నటుడు సూరజ్ వెంజరముడు మాట్లాడుతూ ‘యూత్‌‌‌‌కు నచ్చే సినిమా ఇది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌కు మరింత నచ్చుతుంది. ఫైట్స్‌‌‌‌,  డ్యాన్స్‌‌‌‌, కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌ ఆకట్టుకుంటాయి’ అని చెప్పారు. తమిళంలో మెప్పించిన ఈ చిత్రాన్ని ఒక తెలుగు స్ట్రయిట్‌‌‌‌ సినిమా తరహాలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, యూత్, లవర్స్ మాత్రమే కాదు పేరెంట్స్‌‌‌‌తో కలిసి చూడాల్సిన చిత్రమిదని నిర్మాతలు సందీప్, వినీత్‌‌‌‌ తెలియజేశారు.  హీరోయిన్స్‌‌‌‌ అనిష్మ అనిల్ కుమార్,  మీనాక్షి దినేష్,  ప్రియాన్షి యాదవ్,  లిరిక్ రైటర్ సనరే,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ పాల్గొన్నారు.