హైదరాబాద్, వెలుగు: హర్ ఇండియన్ కా మూన్‌షాట్ 2026 ప్రోగ్రాం పరిధిలో భాగంగా 59 మంది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు బుధవారం శ్రీహరికోటలోని ఇస్రో సందర్శనకు బయల్దేరారు. నాగోల్ హైస్కూల్ వద్ద ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేశ్జెండా ఊపి బస్సును ప్రారంభించారు. చిత్రలేఖనం, వ్యాస రచన పోటీల ద్వారా ఎంపికైన విద్యార్థులు, ఆరుగురు గైడ్ టీచర్లతో రెండు ఆర్టీసీ బస్సుల్లో శ్రీహరికోటకు పయనమయ్యారు.
ఇక్కడి సందర్శన ద్వారా విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహన పొందుతారని డైరెక్టర్ రమేశ్ తెలిపారు. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ విషయాలను తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ జిజ్ఞాస పెరుగుతుందని వివరించారు.
