అయిజ, వెలుగు: గద్వాల జిల్లా ధూప దీప నైవేద్యం అర్చక సమాఖ్య అధ్యక్షుడు, తుప్పత్రాల సీతారామాంజనేయ స్వామి ఆలయ అర్చకుడు చక్రవర్తి ఆచార్యులు తన అద్వితీయ భక్తిని చాటుకుంటున్నారు.
16 ఏండ్లుగా ఆనవాయితీగా వస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా 45 రోజుల పాటు నిష్టతో 30,116 బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖించారు. ఈ విశిష్టమైన బియ్యపు గింజలను ఈ నెల 27న స్థానికంగా నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకల్లో సీతారాముల కల్యాణ తలంబ్రాలుగా వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు.
