- పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం
జమ్మికుంట, వెలుగు: ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరగనున్నాయి. ఈనెల 27న జరిగే శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ మహోత్సవాలు తిలకించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఈనెల 25న బుధవారం రాత్రి 7 గంటలకు స్వామి వారు ఉత్సవ మూర్తులు బాహ్య మందిర ప్రవేశం, 26న గురువారం విశ్వక్సేరాధన రక్షాబంధనం, అంకురార్పణ అగ్నిప్రతిష్ట, 27న సీతారాముల కల్యాణ మహోత్సవం, 28న సీతారాముల పట్టాభిషేకం, శేష వాహన సేవ, 29న గరుడ వాహన సేవ, 30 న హనుమంత వాహన సేవ,31న గజవాహన సేవ, ఏప్రిల్1న అశ్వవాహన సేవ, దోపోత్సవం, ఏప్రిల్ 2న సూర్య రథోత్సవం, 3న చంద్రరథోత్సవం, 4న చంద్ర రథోత్సవం ఊరేగింపు, 5న శ్రీ పుష్పయాగం, 6న సప్తవర్ణాల ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయని ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు.
