సాయిపల్లవి బాలీవుడ్ మూవీ ‘ఒకరోజు’ రిలీజ్

సాయిపల్లవి బాలీవుడ్ మూవీ ‘ఒకరోజు’ రిలీజ్

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌‌‌‌గా మెప్పించిన సాయిపల్లవి.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘ఏక్‌‌‌‌ దిన్‌‌‌‌’. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకుడు. ఆమిర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌ నిర్మిస్తున్నారు. మే 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. తెలుగులో ‘ఒకరోజు’ అనే టైటిల్‌‌‌‌ను ఖరారు చేస్తూ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  

మీరా అనే యువతిగా సాయిపల్లవి కనిపించింది. ‘మీరా నన్ను తిరిగి ప్రేమించాలి..  కనీసం ఒక్కరోజైనా చాలు’ అంటూ తన ప్రేమను దక్కించుకునేందుకు రోహన్ (జునైద్) ఏం చేశాడన్నదే మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌. అయితే మెమొరీలాస్‌‌‌‌తో బాధపడే ఆమెకు.. ఆరోజు ఏం జరిగిందో మరుసటి రోజు గుర్తుండదు. ‘నేను నా జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను అని సాయిపల్లవి అంటుంటే.. కానీ ఇదేది రేపు గుర్తుండదు కదా’ అని హీరో చెప్పడం.. సినిమాలోని మెయిన్‌‌‌‌ కాన్‌‌‌‌ఫ్లిక్ట్‌‌‌‌ను తెలియజేసేలా ఉంది.

సరదా సీన్స్‌‌‌‌తో మొదలైన ట్రైలర్‌‌‌‌‌‌‌‌ హార్ట్ టచింగ్‌‌‌‌ ఎమోషన్స్‌‌‌‌తో ఎండ్ అయింది.  మంచు కొండల్లో విజువల్స్‌‌‌‌, బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ స్కోర్‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్ చేశాయి. థాయ్ మూవీ ‘వ‌‌‌‌న్‌‌‌‌ డే’కు రీమేక్‌‌‌‌. ఇక హిందీలోనూ సాయిపల్లవి డబ్బింగ్ చెప్పగా,  తెలుగు ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు మరొకరు డబ్బింగ్ చెప్పడం ఆమె అభిమానులను నిరాశపరిచింది.