జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు.. తులరాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. కుజుడు సొంత రాశిలో ఎంటర్ కావడంతో అత్యంత శక్తివంతమైన పంచ మహాపురుష యోగాలలో ఒకటైన రుచక రాజయోగం ఏర్పడింది. ఈ యోగం డిసెంబర్ 7 వ తేది వరకు ఉంటుందని పండితులు చెబుబుతున్నారు. కుజుడు ధైర్యసాహసాలకు, పరాక్రమానికి కారకుడు. దీని వలన 6 రాశుల వారు పట్టిందే బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇప్పడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
మిథున రాశి : కుజుడి సంచారంలో మార్పు వలన ఈ రాశివారికి అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుజుడు వృశ్చిక రాశిలో దశమస్థానంలో ఉండటంతో వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి.. ప్రతి పనిలో విజయాలన్నా అందుకుంటారు. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు రెండింతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు ఒక్కసారిగా పుంజుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు అధికంగా లాభాలు వస్తాయి. చేతివృత్తుల వారికి ఆర్డర్లు విపరీతంగా వస్తాయి.
సింహ రాశి : ఈ రాశి వారికి డిసెంబర్ 7 వ తేది వరకు మీలో నూతనోత్సాహంతో ఉంటారు. అనుకున్న పనులు వెంటనే చకాచకా పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగస్తుల పనితీరుకు మెచ్చిర ఉన్నతాధికారులు అవార్డులు అందజేస్తారు. ఆర్థికంగా స్థిరత్వం లభించి, భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలను కూడా పొందుతారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ALSO READ : ఇంట్లో పెద్దల ఫొటోలు ఎదురుగా పెట్టుకోవచ్చా..
కన్య రాశి : ఈ వారికి వృశ్చిక రాశి తృతీయ స్థానంలో కుజుడి సంచారం ఎంతో మేలు చేస్తుంది. ఈ ధైర్యం, ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్థికంగా ఇది ఒక అద్భుతమైన సమయం. ఊహించని మార్గాల నుంచి ధనలాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అనుకోకుండా ధనలాభం.. పాత అప్పులు తీరే అవకాశం ఉంది. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీరి ఆర్థిక విజ్ఞతకు అందరూ ఆశ్చర్యపోతారు.అన్నింటా బాగున్నప్పటికీ, ఆరోగ్యం విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు.
ధనుస్సు రాశి: వృశ్చిక రాశిలో కుజుడు సంచారం ఈ రాశి వారికి సామాజికంగా .. వృత్తి పరంగా అభివృద్ది చెందుతారు. స్నేహితులతో సంబంధాలు బలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. సుదూర ప్రయాణానికి కూడా అవకాశం ఉంది.కొత్త ఆదాయ వనరులు ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. వర్తక, వ్యాపారాలు చేసే వాళ్లకు ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కూడా బాగుంటుంది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రావచ్చు. పెళ్లయిన వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి: కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుజుడు.. చంచల స్వభావం కనుక .. నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం కలుగుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు, ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు అందరి ఆమోదం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు కలసి వస్తాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది.
మీన రాశి : ఈ రాశి వారు అపారమైన తెలివితేటలతో ఏ సమస్యనైనా సులభంగా అధిగమిస్తారు. అదృష్టం మీ వెంటే ఉండి, గొప్ప విజయాలు సాధించే అవకాశాన్ని ఇస్తుంది. కొంతమంది వాదించే అవకాశం ఉంది. మీరు అలాంటి వారికి దూరంగా ఉండండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పూర్వీకుల నుంచి ఆస్తులు పొందే అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సానుకూల మార్పులను చూస్తారు. వ్యాపారులకూ ఇది బాగా కలిసి వస్తుంది. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
