రూ.30 వేల దాకా మారుతి కార్ల ధరల పెంపు

రూ.30 వేల దాకా మారుతి కార్ల ధరల పెంపు

న్యూఢిల్లీ: మారుతి సుజుకి సంస్థ తన వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి అన్ని మోడళ్లపై రూ.30 వేల వరకు ధరలు పెరగనున్నాయి. ఇన్‌‌‌‌పుట్ కాస్ట్ నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఏ మోడల్‌‌‌‌కు ఎంత ధర పెరుగుతుందనేది వెల్లడించలేదు. గత కొన్ని నెలలుగా కంపెనీ ఖర్చులను తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.

ద్రవ్యోల్బణం ఒత్తిడి అధికంగా ఉండటంతో భారాన్ని మార్కెట్‌‌‌‌కు మళ్లించక తప్పని పరిస్థితి ఏర్పడిందని మారుతి చెబుతోంది. సామాన్యులపై ప్రభావం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఎంట్రీ లెవెల్ ఎస్‌‌‌‌-ప్రెస్సో నుంచి ప్రీమియం ఇన్‌‌‌‌విక్టో వరకు అనేక రకాల కార్లను విక్రయిస్తోంది. ఈ వాహనాల ఎక్స్ షోరూమ్ ధరలు రూ.3.5 లక్షల నుంచి రూ.28.70 లక్షల వరకు ఉన్నాయి.