పద్మభూషన్ కు సింధు..పద్మవిభూషన్ కు మేరీకోమ్!

పద్మభూషన్ కు సింధు..పద్మవిభూషన్ కు మేరీకోమ్!

ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన పీవీ సింధు పేరును పద్మభూషన్ కు సిఫారసు చేసింది క్రీడాశాఖ. అలాగే ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన బాక్సర్ మేరీ కో మ్ ను దేశంలోనే అత్యుతన్నత రెండో పురస్కారమైన పద్మవిభూషన్ కు సిఫారసు చేసింది. స్పోర్ట్స్ కోటాలో మరో ఏడుగురు మహిళలను పద్మశ్రీకి సిఫార్సు చేశారు. వారు రెజ్లర్ వినేష్ ఫోగాట్, టేబుల్ టెన్నిస్ స్టార్ మణికా బాత్రా, క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ షూటర్ సుమా శిరూర్ , పర్వతారోహణ కవల సోదరీమణులు తాషి, నుంగ్షి మాలిక్  పేర్లను సిఫారసు చేసినట్లు సమాచారం.

సింధుకు 2015లో పద్మశ్రీ వచ్చింది. 2017లో పద్మభూషణ్ కు సింధు పేరును సిఫారసు చేసినా పట్టించుకోలేదు. అయితే ఈ సారి ప్రపంచ చాంపియన్ గా అవతిరించిన సింధుకు పద్మభూషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక మేరీ కోమ్ కు 2006 లో పద్మశ్రీ , 2013 లో పద్మ భూషణ్ తో సత్కరించారు. ఆమెకు పద్మ విభూషణ్ అవార్డు వస్తే.. 2007 లో చెస్ విజార్డ్ విశ్వనాథన్ ఆనంద్, 2008 లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్,  పర్వతారోహకుడు సర్ ఎడ్మండ్ హిల్లరీ తర్వాత ఈ అవార్డ్ పొందిన నాలుగవ క్రీడాకారిణి అవుతారు.