కరోనా టెన్షన్.. N95 మాస్క్ తోనే సేఫ్

కరోనా టెన్షన్.. N95 మాస్క్ తోనే సేఫ్

కరోనా భయంతో మాస్క్ లు వాడుతున్నా వాటితో ఎలాంటి ఉపయోగం లేదన్నారు ఫీవర్ హాస్పిటల్ సుపెరిడెంట్ శంకర్. N95 మాస్క్ తో  మాత్రమే ఉపయోగకరమన్నారు. అది కూడా వైరస్ సోకిన బాధితుని దగ్గరకు వెళ్లే వైద్యులు, బంధువుల వాడితే సరిపోతుందన్నారు. మాస్క్ లు అందరికీ అవసరం లేదన్నారు. మన వాతావరణ పరిస్థితులకు కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందదన్నారు. ఒక ఫీట్ దూరంలో కరోనా ఉన్న వ్యక్తి తుమ్మితేనే తుంపెరల ద్వారా సోకుతుందన్నారు. 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే వైరస్ గాలిలో ఉంటుందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో ఎటువంటి వైరస్ ను అయినా దూరం పెట్టొచ్చన్నారు. ఈ నెలాఖరు వరకు వైరస్ ప్రభావం తగ్గిపోతుందన్నారు. ఇండియన్ టెంపేరేచర్ లో కరోనా వైరస్ 99 శాతం బ్రతకదన్నారు.