క‌రోనా క‌ష్టాలు : వారికి ఆకులే మాస్కులు

క‌రోనా క‌ష్టాలు : వారికి ఆకులే మాస్కులు

ఏజెన్సీరి ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎప్పూడూ క‌ష్టాలే. ఇప్పుడు క‌రోనా క‌ష్టాలు ఎదుర్కుంటున్నారు. క‌నీసం మాస్కులు లేక ఆకుల‌నే మాస్కులగా క‌ట్టుకుంటున్నారు. ఈ సంఘ‌ట‌న‌ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో జ‌రిగింది. పట్టణాలు, గ్రామాల్లో మాస్క్ లధరించాలని అధికారులు చెబుతున్నారు కానీ.. ఏజన్సీలోని గిరిజనుల గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఏజెన్సీ ప్రజలు వాపోతున్నారు. కరోనా వస్తుందని …మాస్కుల కోసం ఆరాట పడిన ఫలితం లేక పోయింద‌న్నారు.

చేసేది లేక గిరిపుత్రులు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని మాస్కులు తయారు చేసుకున్నారు. పెద్దవారికే కాకుండా చిన్నారులకు కూడా ఆకు మాస్కులను తయారు చేసి కట్టుకుంటున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలోని ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట ఏజెన్సీలోని పలు గిరిజన గూడాల్లో ఈపరిస్థితి నెలకొంది.