రేపు సిటీలో సామూహిక జాతీయ గీతాలాపన

రేపు సిటీలో సామూహిక జాతీయ గీతాలాపన

హైదరాబాద్, వెలుగు: ఈ నెల16న ఉదయం 11.30 గంటలకు ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ కోరారు. ఈ నెల 8వ తేదీ నుంచి 22  వరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహిస్తున్న సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు ఇలా ప్రతిఒక్కచోట సామూహికంగా జాతీయ గీతాన్ని అలాపించి దేశభక్తిని చాటాలన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో దేశ భక్తిపై కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆదివారం తెలిపారు.