నైజీరియాలో కాల్పులు..30 మంది మృతి

నైజీరియాలో కాల్పులు..30 మంది మృతి

న్యూఢిల్లీ: నైజీరియాలో దుండగులు మారణహోమం సృష్టించారు. ఆయుధాలతో ఓ గ్రామంలో చొరబడి ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 30 మంది చనిపోయారు. ఉత్తర నైజీరియాలో నైజర్  స్టేట్ లోని కసువన్ దాజి గ్రామంలో శనివారం ఈ ఘోరం జరిగింది. స్థానికులపై  కాల్పులు జరపడంతో పాటు మార్కెట్, పలు దుకాణాలను కూడా దుండగులు దహనం చేశారు. పలువురు పిల్లలు, స్త్రీలను కూడా కిడ్నాప్  చేశారు. దీంతో స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు.

పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ఘటనా స్థలం నుంచి తమ వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి కూడా స్థానికులు ధైర్యం చేయడం లేదు. మారణహోమం జరిగిన చాలాసేపటి తర్వాత బలగాలు వచ్చాయని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల్లో 30 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు కానీ 40 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.