బిగ్ బ్రేకింగ్...బెంగళూరులో కలరా విజృంభిస్తోంది..50శాతం పెరిగిన కేసులు

బిగ్ బ్రేకింగ్...బెంగళూరులో కలరా విజృంభిస్తోంది..50శాతం పెరిగిన కేసులు

Bengaluru Cholere Out Break: అసలే ఎండాకాలం..తాగటానికి కూడా నీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు.గత కొన్ని రోజులుగా బెంగళూరులో నీటి కొరత ప్రజలను వేధిస్తోంది. ఎంతలా అంటే..కనీసం గొంతు తడుపుకునేందుకు కూడా నీళ్లు దొరకడంలేదు.. అలాంటి పరిస్థితుల్లో బెంగళూరు నగరాన్ని మరో మహమ్మారి అటాక్ చేసింది.. బెంగళూరులో భారీగా కలరా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

గురువారం (ఏప్రిల్ 4) మల్లేశ్వరం ప్రాంతంలోకొత్తగా కలరా కేసు నమోదు అయ్యింది.అదే ప్రాంతంలో మరో రెండు కేసులు పరీక్షల కోసం పంపారు. గత కొద్దిరోజులుగా కలరా కేసులు 50 శాతం పెరిగాయి.  సగటున రోజుకు కనీసం 20 కేసులు పెరుగుతున్నాయని బెంగళూరులోని స్పర్ష్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట రాలజిస్ట్ లు చెబుతున్నారు. నగరంలో పారిశుధ్య లోపం,కలుషిత నీటి వల్ల కలరా కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు అంటున్నారు. 

బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి కొరత కారణంగా నీటి నాణ్యత లోపించి, నీటి ద్వారా వ్యాపించే కలరా వ్యాధి పెరుగుదలకు కారణమవుతోంది. కలరా వ్యాప్తితో బృహత్ బెంగళూరు మెట్రోపాలిటన్ అధికారులు అప్రమత్త మయ్యారు. కలరా వ్యాప్తి జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  

కలరా అంటే ఏమిటి 

కలరా అనేది టాక్సిజెనిక్ బాక్టీరియం విబ్రియో కలరాతో ప్రేగుతో ఇన్ ఫెక్షన్ వల్ల కలిగే తీవ్రమైన అతిసార వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.3 మిలియన్ల నుంచి 4 మిలియన్ల మంది ప్రజలు కలరా బారిన పడుతున్నారని యూఎస్  సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) చెబుతోంది. 

కలరా నివారణ మార్గాలు 

కలరాను నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి.ప్రజలు నీటిని తాగేముందు  తప్పనిసరిగా శుద్ధి చేయాలి. నీటిని కాచి చల్లార్చి తాగితే కలరా నుంచి విముక్తి పొందవచ్చు 
పరిశుభ్రత పాటించాలి. భోజనం తయారు చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా శుభ్రంగా సబ్బు, నీటితో చేతులు కాళ్లు శుభ్రం చేసుకోవాలి. ఉడకని ఆహార పదార్దాలు తీసుకోకూడదు. బాగా వండిన వంటకాలు తినాలి. 

ALSO READ :- రాజకీయ లబ్ధి కోసమే ఫోన్ల ట్యాపింగ్ చేసిన్రు : కిషన్ రెడ్డి