రాజకీయ లబ్ధి కోసమే ఫోన్ల ట్యాపింగ్ చేసిన్రు : కిషన్ రెడ్డి

రాజకీయ లబ్ధి కోసమే ఫోన్ల ట్యాపింగ్ చేసిన్రు :  కిషన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇది అషామాషీ కేసు కాదని..  కక్ష సాధింపు చర్యేనని అభిప్రాయపడ్డారు.  ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని మండిపడ్డారు. పౌరుల  హక్కులను బీఆర్ఎస్ భంగం కలిగించదన్నారు కిషన్ రెడ్డి.  రాజకీయపరమైన లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.  దుబ్బాక, మునుగోడు బైపోల్ టైమ్ లో కూడా ట్యాపింగ్ జరిగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.  పారిశ్రామికవేత్తలు,  ప్రముఖల  ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పారు కిషన్ రెడ్డి.  ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు వసూల్ చేశారన్నారని ఆరోపించారు.    

ఫోన్ ట్యాపింగ్ పై హైలెవల్ విచారణ జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఆంశంపై మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఇందులోనుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.  ఈసీ రూల్స్ ను కేసీఆర్ బ్రేక్ చేశారని ఆరోపించారు.  దీనిపై ఈసీ బాధ్యత కూడా ఉందన్నారు  కిషన్ రెడ్డి.  బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కోర్టు కూడా సుమోటోగా స్వీకరించాలన్నారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకుందని విమర్శించారు కిషన్ రెడ్డి. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసిన పార్టీలు మారాలన్నారు.  

ALSO READ :- ఏపీలో ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు...