న్యూఢిల్లీ: డిజిటల్ మోసాల వల్ల భారతీయ వినియోగదారులు ప్రపంచ సగటు కంటే 36 శాతం ఎక్కువగా నష్టపోతున్నారని ట్రాన్స్‌యూనియన్ తాజా నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం. . గత ఏడాది భారతీయులు సగటున 2,265 డాలర్లు (సుమారు రూ. 2.04 లక్షలు) నష్టపోగా, ప్రపంచ సగటు 1,671 డాలర్లు ఉంది.
దేశంలో అనుమానాస్పద డిజిటల్ మోసాల రేటు 2025 లో 7.1 శాతానికి తగ్గడం గమనార్హం. అంతకుముందు ఏడాది ఇది 13.1 శాతంగా ఉండేది. డిజిటల్ అక్షరాస్యత, కస్టమర్ విద్య, ఫోన్ నంబర్ వెరిఫికేషన్, సైబర్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వల్ల ఈ రేటు తగ్గింది. ప్రపంచ సగటు 3.8 శాతంతో పోలిస్తే భారత్‌లో ఈ రేటు ఇంకా ఎక్కువే ఉంది. 2025 ఆగస్టు–డిసెంబర్ మధ్య 59 శాతం మంది భారతీయులు మోసగాళ్ల బారిన పడ్డారు.
