బహ్రెయిన్‌లోని బాప్కో చమురు శుద్ధి కర్మాగారంపై ఆదివారం ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అక్కడ భారీ పేలుడు సంభవించింది. ఈ దాడి వల్ల రిఫైనరీ ఒక్కసారిగా అగ్నిగోళంలా మారి, ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన వీడియోల ప్రకారం, ఇప్పటికే మంటల్లో ఉన్న కర్మాగారాన్ని మరో క్షిపణి లేదా డ్రోన్ వంటి వస్తువు ఢీకొట్టడం కనిపించింది.
దీన్ని బట్టి ఈ కేంద్రంపై వరుస దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో, వ్యూహాత్మక లక్ష్యంగా ఈ చమురు కేంద్రాన్ని ఇరాన్ దెబ్బతీసింది. ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
