హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం.. ప్లాస్టిక్ రీసైకిల్ యూనిట్ లో మంటలు..

హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం.. ప్లాస్టిక్ రీసైకిల్ యూనిట్ లో మంటలు..

హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ రీసైకిల్ యూనిట్ లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంగళవారం ( జనవరి 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  రాజేంద్రనగర్ బుద్వేల్ లో ఉన్న ప్లాస్టిక్ రీసైకిల్ యూనిట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్న క్రమంలో పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది

మంటలు భారీగా ఎగసిపడుతున్న క్రమంలో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఇంజిన్ రావడం కాస్త ఆలస్యం అవ్వడంతో మంటలు భారీగా వ్యాపించాయి.

ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. భారీగా ఆస్థి నష్టం జరిగి ఉండచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.