మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు

మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు

పాన్ గల్, వెలుగు: యూరియా కోసం మండల రైతులు తిప్పలు పడుతున్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్​ ఆఫీస్​ వద్ద సోమవారం రైతులు చెప్పులు, ఇటుక పెల్లలు, రాళ్లు క్యూలైన్ లో ఉంచి యూరియా కోసం వేచి ఉన్నారు. 

పీఏసీఎస్​కు  450 యూరియా బస్తాలు రావడంతో, విషయం తెలుసుకున్న రైతులు ఆఫీస్​కు చేరుకొని పడిగాపులు కాశారు. యూరియా కోసం రైతులు ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించి, వారి పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు.