ఢిల్లీ ఎంపీ క్వార్టర్స్లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ ఎంపీ క్వార్టర్స్లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం (అక్టోబర్ 18) బీడీ మార్గ్ లోని  బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ లో జరిగిన ఈ ప్రమాదం ఆందోళనకు గురిచేసింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఇండ్లలో పొగ కమ్ముకుంది. దీంతో భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. 

మల్టీఫ్లోర్ కాంప్లెక్స్ పై అంతస్తులలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యారు. పై అంతస్తులలో ఉన్న వారిని లిఫ్ట్ సాయంతో కిందికి దించారు. మంటలు ఒక్కో ఫ్లోర్ వ్యాపిస్తూ కాసేపు భయాందోళనకు గురిచేశాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో.. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. 

►ALSO READ | దారుణం.. చిన్న పిల్లలతో క్లాస్రూం క్లీన్ చేయించారు.. వీడియో వైరల్

ఢిల్లీలోని BD మార్గ్ లో రాజ్యసభ ఎంపీల కోసం 2020 లో బ్రహ్మపుత్ర అపార్టుమెంట్లను నిర్మించారు. పార్లమెంటుకు 200 మీటర్ల దూరంలో పార్లమెంటు సభ్యులకు ఈ అపార్టుమెంట్లను కేటాయించారు. 

రాజ్యసభ ఎంపీలు ఉండే క్వార్టర్స్ లో మంటలు చెలరేగాయని.. ఘటన జరిగి 30 నిమిషాలు దాటినా ఫైర్ ఇంజిన్లు రాకపోవడం దారుణం అని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్లమెంటుకు రెండొందల మీటర్లలో ఉండే క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం జరిగితే.. సహాయక చర్యలు ఇంత ఆలస్యం అవ్వటం ఏంటని ప్రశ్నించారు. భద్రతా చర్యలు చేపట్టడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.