
ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలు చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకులు కావాలని స్కూల్ కి పంపిస్తారు.. తమ పిల్లల ఎదుగుదలను కోరుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బడికి వెళ్లి తమ పిల్లలు చదువుకుంటున్నారనుకున్న పేరెంట్స్ షాక్ ఇచ్చింది. పాఠశాలలో విద్యార్థుల చేత పనులు చేయిస్తున్న ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి ఇది సాక్ష్యం..వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని ఓ గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లలు (విద్యార్థులు) క్లాస్రూం ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛతర్ పూర్ జిల్లాలో ఈఘటన జరిగింది. యూనిఫాంలో ఉన్న విద్యార్థులు చీపురు, తుడుపు కర్రతో క్లాస్ రూం ఫ్లోర్‌ను శుభ్రం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటుపేరెంట్స్, నెటిజన్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఘటన ఛతర్‌పూర్‌లోని కలెక్టర్ బంగ్లా ఎదుట ఉన్న డెరాపహడి పాఠశాలలో జరగడం విశేషం.
►ALSO READ | గరీబ్ రథ్ రైలులో భారీగా మంటలు..మూడు బోగీలు కాలిపోయాయ్
నలుగురు విద్యార్థులు క్లాస్ రూం క్లీన్చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.. ముగ్గురు అమ్మాయిలు నేలను శుభ్రం చేస్తుండగా ఓ బాలుడు సాయంచేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లలు చక్కగా చదువుకొని విద్యాబుద్దులు నేర్చుకోవాలని బడికి పంపిస్తారు.. కానీ వారిని ఈ పరిస్థితుల్లో చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. పాఠశాల సమయాల్లో పిల్లలను పని చేయించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన కొత్తేమి కాదు.. గతంలో కూడా ఛతర్ పూర్ కొన్ని సంఘటనలు జరిగాయి. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విధులు మర్చి తరగతి గదిలో బెంచి పై నిద్ర పోయాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది.