గరీబ్ రథ్ రైలులో భారీగా మంటలు..మూడు బోగీలు కాలిపోయాయ్

గరీబ్ రథ్ రైలులో భారీగా మంటలు..మూడు బోగీలు కాలిపోయాయ్

గరీబ్​ రథ్​ ఎక్స్​ ప్రెస్​ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. ఈ మంటల్లో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్​ లాగి రైలును అపడంతో భారీ ప్రాణం నష్టం తప్పింది. లూథియాను నుంచి ఢిల్లీకి వెళ్తుండగా  సిర్హింద్​ జంక్షన్​ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.  

అమృత్​సర్​ సహర్సా గరీబ్​ రథ్​ ఎక్స్ ప్రస్​ రైలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ( అక్టోబర్​18 ) జరిగిన ఈ ప్రమదంలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలోంచి తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. షార్ట్​ సర్క్సూట్​ కారణంగా సిర్హింద్​ జంక్షన్​ సమీపంలో గరీబ్​ రథ్​ ఎక్స్​ ప్రెస్​ లోని బోగీలనుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 

రైలు లూథియాను నుంచి ఢిల్లీకి వెళ్తుండగా రన్నింగ్​ లో ఉన్న ట్రైన్​ 19వ నంబర్​ కోచ్​నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ బోగీల్లో చాలా బిజినెస్ మెన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటల చెలరేగడంతో ప్రయాణీకులుఉ భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమై గొలుపు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 


సమాచారం అందగానే రైల్వే అధికారులు, సిబ్బంది, GRP, RPF, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సిర్హింద్ GRP SHO రతన్ లా తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.