కొల్లాపూర్ అభివృద్ధి కాంగ్రెస్‌ తోనే సాధ్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ అభివృద్ధి కాంగ్రెస్‌ తోనే సాధ్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్,వెలుగు :   కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేశారు.  అనంతరం, ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.

కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన కబ్జాలు, దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని, ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ధనబలాన్ని నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగుతోందని ఆరోపించారు. కొల్లాపూర్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు, నిజాయితీతో కూడిన పాలన అందించేందుకు ప్రజలందరూ కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.