కుత్బుల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు గోదాం పక్కన ఉన్న ఇంటికి కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంతో కారు పూర్తిగా ధగ్గమైంది. వివరాల్లోకి వెళితే..
మేడ్చల్ మల్కా్జ్ గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ పరిధిలోని బహుదూర్ పల్లి, గ్రీన్ హిల్స్ కాలనీలో గురువారం (ఏప్రిల్ 9) ఉదయం ఓ డెకరేషన్ గోదాంలో ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. గోదాం పక్కనే ఉన్న ఇంటికి కూడా మంటలంటుకున్నాయి. గోదాంలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో గోదాం ముందు పార్క్ చేసిన ఉన్న కారుకు మంటలంటుకొని పూర్తిగా దగ్ధమైంది.
ఉన్నట్టుండి గోదాం నుంచి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
