తాడేపల్లి పెనుమాకలో.. తగలబడుతున్న కొండ

తాడేపల్లి పెనుమాకలో.. తగలబడుతున్న కొండ

ఏపీ: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పెనుమాకలో కొండపై భారీగా అగ్నికీలలు ఎగిసిడుపతున్నాయి. నిన్న (ఆదివారం) సాయంత్రం ఉండవెల్లి కొండకు  గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దాంతో అప్పటినుంచి మంటలు చుట్టు పక్కల వ్యాపించి ఈ రోజు పెనుమాక వైపు పాకాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కొండ కింది భాగంలో నివాసగృహాలు ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఉండవెల్లి కొండ మొత్తం దాదాపుగా  తగలబడిపోయింది. 

రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.తాడేపల్లి ఎస్ ఐ సాయికుమార్, కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది కొండపైకి చేరుకున్నారు. మంటలార్పేందుక  ప్రయత్నించారు.  కొండ దిగువ భాగానికి మంటలు వ్యాపించకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.