
ఒడిశా పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ స్కాం వెలుగులోకి వెచ్చింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో పరీక్షలు నిర్వహించే ఏజెన్సీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 150 మందికి పైగా అభ్యర్థులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఒడిశా సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) నియామక పరీక్షలో భారీ మోసాన్ని బెర్హంపూర్ పోలీసులు బయటపెట్టారు.SI నియామక పరీక్ష నిర్వహించే బాధ్యత తీసుకున్న ఓ ప్రైవేట్ సంస్థ స్కాం కు పాల్పడినట్లు గుర్తించారు. నియామకాల్లో అవకతవలకు పాల్పడేందుకు తరలిస్తున్న ట్లు ఆరోపణలు రావడంతో ఈ స్కాంతో సంబంధమున్న 150మందికి పైగా అభ్యర్థులను అరెస్ట్ చేశారు. పరీక్షల్లో మోసాలకు పాల్పడే వ్యూహంలో భాగంగా హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా 150 మందికి పైగా అభ్యర్థులను అరెస్ట్ చేశారు బెర్హంపూర్ పోలీసులు.
ఒడిశా SI నియామక పరీక్షలో భారీ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరీక్షలను నిర్వహణ బాధ్యత తీసుకున్న ఏజెన్సీ స్కాంలో కీలక సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. SI పరీక్షలో అవకతవకలకు పాల్పడేందుకు అభ్యర్థులను ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఏపీలోని శ్రీకాకుళంలో 150 మందికి పైగా అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. మూడు బస్సుల్లో అభ్యర్థులను తరలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని బ్రహ్మపూర్ కు తరలించారు.
నియామక ప్రక్రియను తారుమారు చేసేందుకు SI నియామక ఏజెన్సీ స్కాం కోసం ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగార్థులను మోసం చేసి నకిలీ అభ్యర్థులతో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించినట్లు మోసాలకు పాల్పడుతున్న పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సబ్ ఇన్ స్పెక్టర్ల నియామక ప్రక్రియలో ఈ స్కాం ఒడిశాలో ఉద్యోగార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సంస్థలు, అభ్యర్థులతో సహా ఈస్కాంలో ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటాని పోలీసులు చెబుతున్నారు.