హైదరాబాద్, వెలుగు: క్లీన్ ఎనర్జీ కంపెనీ అగస్త్య గ్రీన్ ఎనర్జీ కర్నూలులో సోలార్ ప్లాంటు నిర్మిస్తామని ప్రకటించింది. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు కోసం రూ.7,800 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 12 గిగావాట్ల ఇంగట్, వేఫర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 3,500కుపైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఏయూజీ గ్రూప్ చైర్మన్ అనుభవ్ అగర్వాల్ మాట్లాడుతూ, దేశీయ ఇంధన భద్రతకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని చెప్పారు. ఈ ప్లాంటు ద్వారా సోలార్ వాల్యూ చైన్ మరింత బలపడుతుందని అగస్త్య ఎనర్జీ డైరెక్టర్ పీయూష్ బిచోరియా ఈ సందర్భంగా తెలిపారు.
