హైదరాబాద్ లో కుండపోత వాన

హైదరాబాద్ లో కుండపోత వాన

హైదరాబాద్, వెలుగు:  సిటీలో ఆదివారం పొద్దంతా మేఘాలు కమ్ముకుని.. సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. గంటకు పైగా పలు ప్రాంతాల్లో దంచికొట్టింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్​జామ్ లు అవడంతో పాటు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేసింది. అధికంగా మలక్ పేట్​లో 7.1, చార్మినార్ లో 6.9, నాంపల్లిలో 6.9 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 

అదేవిధంగా ఎల్​బీనగర్​, హయత్​ నగర్​, వనస్థలిపురం, బండ్లగూడ జాగీర్,  ఖైరతాబాద్​, అసెంబ్లీ ఏరియా, పంజాగుట్ట, బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​, ఫిల్మ్ నగర్​, షేక్​పేట్​, బషీర్​బాగ్, అబిడ్స్, కోఠి, నారాయణ గూడ, హిమాయత్​నగర్, ఫీవర్​హాస్పిటల్, నల్లకుంట, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్​రోడ్స్, చిక్కడపల్లి, సికింద్రాబాద్, పద్మారావు నగర్, బోయిగూడ, శేరిలింగంపల్లి, గుడి మల్కాపూర్, ఉప్పుగూడ, దోమల గూడ, కిస్మత్​పూర్, హిమాయత్​సాగర్, రాజేంద్ర నగర్, మెహిదీపట్నం, మైలార్ దేవ్​పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంబర్​పేట్,​ రాంనగర్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.  వాన సమస్యలపై ఈవీడీఎంకు 24  కంప్లయింట్లు వచ్చాయి.  అలాగే మాదాపూర్​, గచ్చిబౌలి, హైటెక్​ సిటీ పరిసర ప్రాంతాల్లో మోస్తరుగా వాన పడింది.