
- శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్‌రావు
గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో వైన్స్షాపుల దరఖాస్తులు ఊపందుకున్నాయని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్‌రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ మండలంలో 40 వైన్స్ షాపులు ఉండగా 290 దరఖాస్తులు, శేర్లింగంపల్లిలో 44 షాపులకు 570, చేవెళ్లలో 27 షాపులకు 52, సరూర్ నగర్‌లో 32 షాపులకు 117, హయత్ నగర్‌లో 28 షాపులకు 90, షాద్నగర్లో 28 షాపులకు 23, మహేశ్వరంలో 14 షాపులకు 40, ఇబ్రహీంపట్నంలో 19 షాపులకు 28, అమ్మ నగర్‌లో 17 షాపులకు 25 దరఖాస్తులు వచ్చాయన్నారు.