బైకును ఢీకొన్న లారీ.. భార్యాభర్తలు స్పాట్ డెడ్.. పాపం..! రెండేళ్ల చిన్నారికి కాలు విరిగింది..

బైకును ఢీకొన్న లారీ.. భార్యాభర్తలు స్పాట్ డెడ్.. పాపం..! రెండేళ్ల చిన్నారికి కాలు విరిగింది..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బైకును లారీ ఢీకొన్న ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా రెండేళ్ల చిన్నారికి కాలు విరిగింది. బుధవారం ( నవంబర్ 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం ఆరేపల్లి దగ్గర వెళ్తున్న బైకును ఢీకొట్టింది లారీ. ఈ ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. రెండేళ్ల చిన్నారికి కాలు విరిగింది.

లారీ కరీంనగర్ వైపు వెళ్తుండగా.. బైకు కామారెడ్డి వైపు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. మృతి చెందిన భార్యాభర్తలు రామగుండం ఏంటీపీసీకి చెందిన వసీం, ఐఫాగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. చిన్నారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.