
ట్యాంక్ బండ్, వెలుగు: రాష్ డ్రైవింగ్ వల్ల ఓ కారు డివైడర్‌పై కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున సెక్రటేరియట్ నుంచి ఖైరతాబాద్ వైపు ఇన్నోవా కారు వేంగంగా వెళ్తోంది. ఎన్టీఆర్ మార్గ్ వద్ద డివైడర్ పైకెక్కి కరెంటు పోల్ను ఢీకొట్టడంతో అది విరిగిపోయింది. కారు అదే స్పీడ్ లో పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. కారును అక్కడే వదిలి అందులో ఉన్నవారు పరారయ్యారు.
ఆగి ఉన్న లారీని..
శంషాబాద్: బాబుల్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి(క్యాబ్ డ్రైవర్) కారులో ఓ ప్యాసింజర్‌ను ఎక్కించుకుని అరంఘర్ నుంచి దుర్గానగర్ వైపు వెళ్తున్నాడు. మధ్యలో బైపాస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో క్యాబ్ ముందు భాగం ధ్వంసమైంది.
ఉప్పల్ రింగ్ రోడ్ లో రెండు కార్లు ఢీ..
ఉప్పల్: హబ్సిగూడ నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న బెలోనో కారును రింగ్ రోడ్డు వద్ద వెనుక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో లేడీ డాక్టర్ ప్రాణాలతో బయటపడ్డారు.