జ్యువెలరీ షాపులో భారీ చోరీ

జ్యువెలరీ షాపులో భారీ చోరీ

8 తులాల గోల్డ్, 80 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్​జిల్లాలోని జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి టైంలో షాపులో చొరబడ్డ దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. శామీర్​పేట పీఎస్​పరిధిలోని తూముకుంటలో హైవే పక్క కృష్ణ జ్యువెలరీస్​పేరుతో జగదీశ్​అనే వ్యాపారి షాపు నడుపుతున్నాడు. రోజూలాగే మంగళవారం రాత్రి జగదీశ్​కొడుకు గణేశ్​షాపు క్లోజ్​చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత జ్యువెలరీ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి, 48 తులాల బంగారు, 80 కిలోల వెండి ఆభరణాలు, కొంత నగదును ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం షాపులో దొంగలు పడినట్లు తెలుసుకున్న జగదీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

బాలనగర్ డీసీపీ సురేశ్, మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, సీఐ శ్రీనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ తో వివరాలు సేకరించారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. త్వరలో పట్టుకుంటామని మేడ్చల్ అడిషనల్​డీసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో శామీర్ పేట పోలీసులు కేసు నమోదు  చేశారు.