దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారీగా బదిలీలు చేపట్టింది ఎక్సైజ్ శాఖ. డిపార్టుమెంట్ లో మొత్తం 1912 మంది సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లు 2026 ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. 2018 తర్వాత ఇంత పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్లు చేపడుతున్నారు. జోన్ వారీగా హెడ్ కానిస్టేబుళ్లను, జిల్లా వారీగా కానిస్టేబుళ్ల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
శాఖలో మొత్తం 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1586 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎక్సైజ్ శాఖ కమిషనర్ జారీ చేశారు. బదిలీ అయిన ఉద్యోగులు మూడు రోజుల్లో కొత్త స్థానాల్లో చేరాలని ఆదేశించారు. ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు.
ఎక్సైజ్ శాఖలో బదిలీ ప్రక్రియ ఏప్రిల్ 4 నుంచి 10 వరకు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పరిపాలన సుగమం చేసేందుకు బదిలీలు చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
