న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సర్వీసులు అందించే టాటా క్యాపిటల్, గోల్డ్ లోన్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేరళకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ యోగక్షేమం లోన్స్ లిమిటెడ్ (యోగ్‌లోన్స్)లో 88.6 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ కోసం యోగక్షేమం లోన్స్ విలువను రూ. 318 కోట్లుగా లెక్కించారు. దీని బిజినెస్‌ను విస్తరించేందుకు టాటా క్యాపిటల్ రూ. 93 కోట్ల కొత్త క్యాపిటల్‌ను అందించనుంది.
