హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. 43 మంది డీఎస్పీలను ట్రాన్స్ ఫర్, పోస్టింగ్ ఇస్తూ డీజీపీ అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేటాయించిన జిల్లా యూనిట్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. గ్రేటర్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో బదిలీల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలా కాలంగా వెయిటింగ్ లో ఉన్నవారికి పోస్టింగ్ ఇచ్చారు.
అన్ని జిల్లాల ఎస్పీ, కమిషనరేట్లలో భారీగా బదిలీలు జరిగాయి. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డిని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డీఎస్సీగా బదిలీ చేశారు. అక్కడి భీంరెడ్డిని హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎల్ బీనగర్ ఏసీపీగా జానకి రెడ్డిని, కాచిగూడ ఏసీపీగా కస్తూరి శ్రీనివాస్‌ను నియమించారు.
