ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పెరిగిన భూగర్భజలాలు

ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పెరిగిన భూగర్భజలాలు
  • భారీగా పెరిగిన భూగర్భజలాలు
  • మోటార్ పంప్ స్టార్ట్ చేయకుండానే పొలాలు పారుతున్న వైనం
  • మూడు బోరుబావుల నుండి బయటకు వస్తున్న నీరు
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లిలో బోరు బావుల నుండి నీరు పైకి ఉబికి వచ్చేలా భూగర్భజలాలు పెరిగాయి. దీంతో బోరుబావులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తరలివస్తున్నారు. మోటార్ పంపు స్టార్ట్ చేయకుండానే నీరు పొలాల్లోకి పారుతోంది. దాదాపు ముగ్గురు రైతుల బోరుబావుల్లో పది రోజులుగా నీరు బయటకు ఉబికి వస్తోంది. 

గ్రామంలో భూగర్భజలాలు పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోరు బావుల నుండి నీరు బయటకు రావడంపై పక్క గ్రామాల రైతులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. దీంతో సయ్యద్ పల్లి గ్రామంలోని బోరుబావులను చూసేందుకు ప్రజలు వస్తున్నారు. తమ బోరులో కూడా ఇలా నీళ్ళు వస్తే బాగుండంటూ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.