హైదరాబాద్, వెలుగు: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యాసంస్థలకు చెందిన హైదరాబాద్ బ్రాంచ్ విద్యార్థులు ఎం. సహిష్ణు (హాల్.నెం: 592354) ఆల్ ఇండియా 5వ ర్యాంక్, ఎల్. ఆకాశ్(హాల్.నెం: 593940) 8వ ర్యాంక్ సాధించారని యాజమాన్యం తెలిపింది.
సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో తమ విద్యార్థులు భారీగా ఉత్తీర్ణత సాధించారని చెప్పింది. విద్యా సంస్థల అకడమిక్ ప్రణాళిక విద్యార్థులు కామర్స్ కోర్సులలో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడానికి ఎంతగానో దోహద పడుతున్నాయని పేర్కొంది. ఉత్తమ ర్యాంకులు సాధించిన స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులను హైదరాబాద్ బ్రాంచ్ అడ్మిన్ ప్రిన్సిపాల్స్ ఎస్. వెంకటేశ్వరరావు, ఎస్.ఎం. వలి, బ్రాంచ్ అకడమిక్ ప్రిన్సిపాల్స్ ఆంజనేయరెడ్డి, అశోక్ అభినందించారు.
