వరుడు కావాలి… పేపర్ యాడ్ వైరల్.. ఎక్కడంటే..

వరుడు కావాలి…  పేపర్ యాడ్  వైరల్.. ఎక్కడంటే..

 ఈ మధ్య కాలంలో మనుషుల ఆలోచనా తీరు మారుతోంది. పెళ్లి విషయంలో మ్యాట్రిమోనియల్ ప్రకటన వైరల్‌గా మారింది.  నచ్చిన అబ్బాయే కావాలని అమ్మాయిలు, నచ్చిన అమ్మాయే కావాలని అబ్బాయిలు మొండిగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చిన లక్షణాలు ఉన్న వధువు/వరుడు దొరకకపోతే మ్యాట్రిమొనీల ద్వారా, పెళ్లి ప్రకటనల ద్వారా వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వింత పెళ్లి ప్రకటన వైరల్ అవుతోంది.

ముంబయిలో చిన్న వివాహానికి వరుడు కావాలంటూ  న్యూస్ పేపర్లో వచ్చిన ప్రకటన వైరల్ గామారింది. ఈ ప్రకటన నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంతో వైరల్ గా మారింది.  విడాకులు తీసుకున్న అమ్మాయికి వరుడు కావలెను అని యాడ్ ప్రచురణ అయింది.  అయితే గతంలో తనకు వివాహం అయిన తరువాత ఎక్కువ కాలం తన మాజీ భర్తతో కలిసి ఉండలేదని  తెలిపింది.   ధనవంతుల కుటుంబంలో జన్మించిన బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి 1989 లో విడాకులు తీసుకుందని ప్రకటనలో ఉంది. 5'7 " హైట్ తో ఉండి బాగా చదువుకొని ఎన్నో తెలివితేటలున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.  ప్రస్తుతం ముంబయిలో సొంతంగా ఆస్పత్రి నడుపుతున్నానని పేర్కొంది.  ఈ ప్రకటనపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు.