
బలరాంపూర్(యూపీ): దసరా, దీపావళి పండుగల సందర్భంగా అశాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తే తరతరాలు గుర్తుండిపోయేలా శిక్షిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ఈమేరకు ఆదివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘పండుగలు, ఉత్సవాల సమయాల్లో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే వారి భవిష్యత్తు తరాలకూ గుర్తుండిపోయేలా శిక్షలు అనుభవిస్తారు. ఘజ్వా-ఎ-హింద్ ను ఊహించుకోవడం లేదా దాని గురించి కలలు కంటే నరకానికి టికెట్టు కొనుకున్నట్టే.
నరకానికి వెళ్లాలనుకునే వారిని ఘజ్వా–-ఎ–-హింద్ పేరుతో అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నించనివ్వండి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిని నరకానికి పంపిస్తాం” అని పేర్కొన్నారు.