
చెన్నై: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పెండ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత సంతతికి చెందిన తన గాళ్‌ఫ్రెండ్ వినీ రామన్‌ను మ్యాక్సీ గతవారమే మెల్‌బోర్న్‌లో పెండ్లి చేసుకున్నాడు. అయితే, విని తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వాళ్లు కావడంతో ఈ జంట చెన్నైలో హిందు సంప్రదాయం ప్రకారం మరోసారి పెండ్లి వేడుక నిర్వహించింది. ఇందులో భాగంగా తమిళ ఆచారం ప్రకారం మ్యాక్సీ, విని డ్యాన్స్ చేస్తూ పెళ్లి దండలు మార్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. కాగా, ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. తను తొందర్లోనే ఆర్‌సీబీ టీమ్‌లో చేరుతాడు.
Vanakam da Mapla @Gmaxi_32 ??#WhistlePodu | #IPL2022 pic.twitter.com/wRVdrUrGv6
— CSK Fans Army™ ? (@CSKFansArmy) March 28, 2022