మే 13న నిమ్స్ హాస్పిటల్​కు సెలవు

మే 13న నిమ్స్ హాస్పిటల్​కు సెలవు

పంజాగుట్ట, వెలుగు: లోక్​సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న సిటీలోని నిమ్స్ హాస్పిటల్ క్లోజ్ ఉంటుందని హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతివీర్ తెలిపారు. అత్యవసర విభాగం మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లు గమనించాలని, 14న అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.