పంజాగుట్ట, వెలుగు: ఈజీ మనీ కోసం డ్రగ్స్ దందా చేస్తున్న ఓ వ్యక్తిపాటు ముగ్గురు వినియోగదారులను హెచ్-న్యూ, పంజాగుట్ట పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ కేశవ్ సింగ్ జాలీ కోసం డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాడు. ఆపై వ్యసనానికి బానిసై, సులభంగా డబ్బు సంపాదించేందుకు విక్రేతగా మారాడు.
పాత పరిచయాలతో డ్రగ్స్ సేకరించి.. చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లోని సాప్ట్వేర్ ఇంజినీర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేసి, రూ. 1.40 లక్షల విలువైన 13.5 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల చరాస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
