- ఎంబీఎస్సీ కులాల సమితి అధ్యక్షుడు వెంకటేశం డిమాండ్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం దళితుల్లో అత్యంత వెనుకబడ్డ 57 ఎంబీఎస్సీ కులాలాకే టికెట్లు కేటాయించాలని 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ అంశంపై నియోజకవర్గ ఇన్చార్జ్లను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆదేశించాలని కోరారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంబీఎస్సీలు సంపూర్ణ మద్దతు తెలిపి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ప్రభుత్వానికి మద్దతు పలికిందని గుర్తుచేశారు. దళితులకు కేటాయించే స్థానాలలో 30 శాతం కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ పదవులు ఎస్సీ ఉపకులాలకు కేటాయించాలని పీసీసీ చీఫ్ కు బైరి వెంకటేశం విజ్ఞప్తి చేశారు.
