రిజిస్టర్ డాక్టర్లందరికీ టెలీ మెడిసిన్ కోర్స్

రిజిస్టర్ డాక్టర్లందరికీ టెలీ మెడిసిన్ కోర్స్
  • తప్పక దాన్ని పూర్తి చేయాల్సిందే
  •  కేంద్రం కొత్త విధానం

కరోనా ఎఫెక్ట్ వల్ల వైద్య రంగంలో కొత్త మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్లకు టెలిమెడిసిన్ విధానంలో వైద్య సేవలు అందించేందుకు అనుమతిచ్చింది. రిజిస్టర్ డాక్టరందరూ ఈ టెలి మెడిసిన్ కోర్సును పూర్తి చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఫోన్, వీడియోల ద్వారా పేషెంట్లతో ఇంటరాక్ట్ అవుతూ ట్రీట్ మెంట్చేసే ఈ విధానం అమలు కోసం సర్టిఫికెట్ కోర్సును రూపొందించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)ను కేంద్రం ఆదేశించింది. ఎంసీఐ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. డాక్టర్ బి.ఎన్.గంగాధర్ చైర్మన్ గా ఆరుగురు సీనియర్ డాక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో సైన్సెస్(ఎన్ఐ ఎంహెచ్ఏఎన్ఎస్)తో కలిసి ఎంసీఐ టెలిమెడిసిన్ ప్రాక్టీస్ పై ఆన్ లైన్ కోర్సును డెవలప్ చేస్తోంది. టెలి మెడిసిన్ కోర్సు ప్రకటన జారీ అయిన మూడేండ్లలోపు రిజిస్టర్ డాక్టర్లందరూ దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.