తడిసిన పత్తిని కూడా కొనేలా చర్యలు : కిషన్ రెడ్డి

తడిసిన పత్తిని కూడా కొనేలా చర్యలు : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : పత్తి నష్టాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ఎంపీ కిషన్ రెడ్డి. శనివారం కాటన్ కార్పొరేషన్ ఇండియా అధికారులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమాజిగూడలని దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తెలంగాణలో 22 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అవుతుందని..పత్తి చేతికి వచ్చే టైంకే రాష్ట్రంలో వర్షాలు వచ్చాయన్నారు. దీంతో చాలా చోట్ల చెట్టుమీదనే పత్తి తడిసిపోయిందని..దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

కాటన్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని..ఇప్పుడిప్పుడే మార్కెట్ కు పత్తి వస్తుందన్నారు. 10,15 రోజుల్లో పత్తి మార్కెట్ కు వస్తుందన్న ఆయన..ప్రతి కేజీ కూడా కొనుగోలు చేస్తామన్నారు. పత్తి తడిస్తే ఎండపెట్టుకొని మార్కెట్ కు తీసుకరావాలని రైతులను కోరుతున్నామన్నారు. 12 % తేమ ఉన్న కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని..ఈ పత్తిని రూ. 5 వేల 232లకు CCIనే కొనుగోలు చేస్తుందన్నారు. పత్తిని అమ్మిన తర్వాత రైతుల అకౌంట్ లోకి 3 రోజుల్లోనే డబ్బులు వస్తాయని..  107 చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు కిషన్ రెడ్డి.