కార్వాన్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే భార్య సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా ఏకగ్రీవం ..సొంత గ్రామం మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా బస్వాపూర్‌‌‌‌‌‌‌‌లో నామినేషన్‌‌‌‌‌‌‌‌

కార్వాన్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే భార్య సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా ఏకగ్రీవం ..సొంత గ్రామం మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా బస్వాపూర్‌‌‌‌‌‌‌‌లో నామినేషన్‌‌‌‌‌‌‌‌

వెల్దుర్తి, వెలుగు : కార్వాన్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కౌసర్‌‌‌‌‌‌‌‌ మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌ భార్య నజ్మా సుల్తానా సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. నజ్మా సుల్తానా తన సొంత గ్రామమైన మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా ఇటీవల నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేసింది. నజ్మాతో పాటు నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేసిన మరో క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌.. తన నామినేషన్‌‌‌‌‌‌‌‌ను విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవడంతో నజ్మా ఎన్నిక ఏకగ్రీవమైంది. నజ్మా సుల్తానా గతంలో రెండు సార్లు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గోల్కొండ నానక్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. బస్వాపూర్‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ పదవితో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి.