సారలమ్మకు ఎదురుకోళ్లు .. గద్దెల సమీపంలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు

సారలమ్మకు ఎదురుకోళ్లు .. గద్దెల సమీపంలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు

మేడారం జాతరలో బుధవారం అమ్మవార్ల గద్దెల సమీపంలో భక్తులు ఎదురుకోళ్ల మొక్కులు చెల్లించుకున్నారు. సారలమ్మ రాకకు ముందు కోళ్లను గాలిలో ఎగురవేస్తూ సందడి చేశారు. అమ్మవారి స్వాగతానికి సంకేతంగా కోళ్లను ఎగురవేయడం ఆనవాయితీ. ఈ కోళ్లు ఎంత ఎత్తుకు ఎగిరితే అంత మంచిదని ఇక్కడి భక్తుల విశ్వాసం.