మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. జాతర పరిసరాల్లో 50 ప-డకల హాస్పిటల్‌తో 30 స్పెషల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఆయుష్ వైద్య శిబిరం ద్వారా ఇప్పటికే ఆరు వేల మందికి వైద్యం అందించినట్లు డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న రోగులను మంత్రి సీతక్క పరామర్శించి, వైద్యసేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. మరో వైపు అత్యవసర సేవల కోసం జాతర పరిసరాల్లో బైక్ అంబులెన్స్‌లను సైతం సిద్ధంగా ఉంచారు.
