హెలికాప్టర్‌‌ సేవలు ప్రారంభం .. పడిగాపూర్‌‌ లో హెలిప్యాడ్‌ ఏర్పాటు

హెలికాప్టర్‌‌ సేవలు ప్రారంభం .. పడిగాపూర్‌‌ లో  హెలిప్యాడ్‌  ఏర్పాటు

మేడారం జాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్‌‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను గురువారం మంత్రి సీతక్క ప్రారంభించారు. పడిగాపూర్‌‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌‌ నుంచి జాయ్‌‌ రైడ్స్‌‌ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా భక్తులకు ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఏరియల్‌‌ వ్యూ ద్వారా మేడారం జాతర పరిసరాలను చూపించనున్నారు. 

ఇందుకు ఒక్కో వ్యక్తికి రూ.4,800 చార్జీగా నిర్ణయించారు. అలాగే హనుమకొండ నుంచి మేడారం వరకు హెలికాప్టర్‌‌ను నడపనున్నారు. ఇందుకు రానుపోను ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.35,999గా చార్జీలు నిర్ణయించారు. ఈ నెల 31 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు హెలికాప్టర్ రైడ్స్‌‌ అందుబాటులో ఉంటాయని ఆఫీసర్లు తెలిపారు.