మేడారం జాతర: రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు

మేడారం జాతర: రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు

ఏటూరునాగారం,వెలుగు: మేడారం జాతరలో గురువారం వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతర ఏరియాలో అస్వస్థతకు గురైన భక్తులను ప్రధాన మెడికల్ క్యాంప్ కు తరలించే క్రమంలో నలుగురు మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు.

  జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జగన్నగూడెంకు చెందిన సిద్ధగోని శంకర్ గౌడ్ (50), గురువారం రాత్రి  చనిపోయారు.  అతిగా మద్యం తాగి హైదరాబాద్ లోని అల్వాల్ కు చెందిన పల్లెపు రాజు(40), మంచి ర్యాల జిల్లా గోదావరిఖనికి చెందిన రవీందర్ సింగ్ టాగోర్(41) చనిపోయినట్టు అధికారులు తెలిపారు. 

మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన రేవల్లి సుగుణ(60) గురువారం జంపన్న వాగులోంచి కుటుంబ సభ్యులతో వస్తుండగా చెత్త సేకరించే ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ప్రమాదంలో  సుగుణతో పాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.